బురదతో నిండిన గవర్నమెంట్ హాస్పిటల్

కొత్తగూడెం గవర్నమెంట్ ఆసుపత్రి ఏరియాలో ఇటీవలి వర్షాలకు దారి అంతా బురదమయంగా మారి నీళ్లు నిలిచిపోయాయి. గుంతలు పడటంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు, గర్భిణులు, ముసలివాళ్లు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు నిలవడం వల్ల దోమలు పెరిగి రోగాలు వచ్చేలా ఉన్నాయని జనం భయపడుతున్నారు. ఆసుపత్రి ఏరియాలో నిలిచిన నీటిని తీసి, డ్రైనేజీ సదుపాయం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.



