రేపు ఐలమ్మ, బాపూజీ జయంతి వేడుకలు!

కామారెడ్డి జిల్లాలో నారి చాకలి ఐలమ్మ జయంతి ఈ నెల 26న ఉదయం 10 గంటలకు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 27న ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహం ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహం, నూతన బస్టాండ్ చౌరస్తాలోని బాపూజీ విగ్రహాల వద్ద వేడుకలు జరుగుతాయి.



