బాలాపూర్ గణేష్ బై బై

హైదరాబాదులో బాలాపూర్ గణేష్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. నిమజ్జనం చివరిరోజున తొలుత కదిలేది బాలాపూర్ గణేషుడే. లడ్డూ వేలంలో కూడా క్రేజీ సృష్టించింది హుస్సేన్ సాగర్లో ఈ గణేషుడి నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. 12వ క్రేన్ ద్వారా సాగర్‌లో నిమజ్జనం చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి ట్యాంక్ బండ్‌పై పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ జై నర్సయ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, హైడ్రా, వైద్య శాఖలు సేవలు అందించాయి.



