← Back to news

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

By A.Ajay· 5 Oct 2026
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మాంగాడు పరిధిలో భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పట్టూర్‌లోని దీనానగర్‌కు చెందిన ముజాయిదీన్‌, సోఫియా దంపతులకు కొడుకు ఉన్నాడు. సోఫియా ఫోన్‌లో మాట్లాడటంపై ముజాయిదీన్‌కు అనుమానం ఏర్పడి, కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో కత్తితో సోఫియా మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. తరువాత పారిపోయిన అతడిని బుధవారం పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.

More in Crime