📝 చిలమత్తూరులో రైతుల ధర్నా

AP : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు చాగలేరు పంచాయతీ రైతులు నిరసనకు దిగారు. స్లాట్ బుక్ చేసుకుని, పేపర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా రెండు వారాలుగా భూముల రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో ఆఫీస్ పనులకు డిస్టబెన్స్ కలగగా, సబ్ రిజిస్ట్రార్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు రైతులు చెప్పారు. పొలిటికల్ ప్రెజర్ వల్లే పనులు ఆపేశారని, క్లియర్ రీజన్ చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.



