ఇరాన్ ఏడు కండిషన్స్.. అమెరికాతో చర్చలకు రెడీ!

అమెరికాతో మళ్లీ చర్చలు మొదలుపెట్టేందుకు ఇరాన్ ఏడు కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఖతర్ ద్వారా ఈ కండిషన్స్‌ను అమెరికాకు పంపినట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని ఆపడం, ఇరాన్‌కు చెందిన నిలిపివేసిన డబ్బును రిలీజ్ చేయడం, సముద్రంపై ఆంక్షలను తీసేయడం లాంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. మిగతా నాలుగు కండిషన్స్‌ను ఇరాన్ బయటకు చెప్పలేదు.



