చిన్నారుల మిస్సింగ్.. గంటల్లోనే కాపాడిన పోలీసులు

TG: HYD నగరం గచ్చిబౌలిలో మిస్ అయిన ఇద్దరు చిన్నారుల్ని పోలీసులు గంటల వ్యవధిలోనే కనిపెట్టారు. రాఘవ ప్రాజెక్ట్ లేబర్ క్యాంప్‌కు చెందిన ప్రమీలా ముర్ము(4), సంగీత (3) చిన్నారులను దుకాణానికి తీసుకెళ్తానని చెప్పి చాకు సోరెన్ అనే వ్యక్తి బయటకు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించారు.



