ఊర్వశి రౌతేలా పోస్టులతో పాఠాలు.

పాప్ కల్చర్, బాలీవుడ్ గాసిప్స్, మీమ్స్ అంటే కేవలం కాలక్షేపం మాత్రమే కాదు. వాటి వెనుక లోతైన ఫిలాసఫీ, సోషియాలజీ ఉన్నాయని కొత్త తరం 'స్కాలర్-ఫ్లూయెన్సర్లు' చెబుతున్నారు. ఊర్వశి రౌతేలా పోస్టులు, కిమ్ కర్దాషియాన్ విజువల్స్, టీవీ సీరియళ్లను కూడా కేస్ స్టడీలుగా వాడుకుంటూ ప్రొఫెసర్లు, పరిశోధకులు రీల్స్ ద్వారా ఫిలాసఫీ, ఎకనామిక్స్ పాఠాలు చెబుతున్నారు. కష్టమైన కాన్సెప్టులను మీమ్స్‌తో ముడిపెట్టి 60 సెకన్ల వీడియోల్లోనే అర్థమయ్యేలా వివరిస్తున్నారు.



