← Back to news

రమానందనకు మరో కేసులో నోటీసులు

By Krishna· 2d ago
రమానందనకు మరో కేసులో నోటీసులు

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో యూట్యూబర్ రమానందనకు ప్రకాశం జిల్లా, అద్దంకి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. బాధితుడు శ్రీనివాసరావు ఇచ్చిన కంప్లైంట్‌తో సెప్టెంబర్ 17న విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, ఉద్యోగాల పేరుతో మోసం చేశారని క్రాంతికుమార్ అనే మరో బాధితుడు NTR జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు గతంలోనే కంప్లైంట్ చేశారు. ఈ కేసు విచారణ కోసం సెప్టెంబర్ 8న ఒకసారి పోలీసుల ముందుకు వచ్చిన ఆమెను, 16న మళ్లీ రావాలని పోలీసులు సూచించారు.

More in AP