నల్లబెల్లిలో 1mm వర్షమే.. పంట ఏడుపు!

వరంగల్‌లో ఆదివారం వర్షం పేరుకు మాత్రమే! నల్లబెల్లిలో కేవలం 1.0 మి.మీ. వర్షం.. అంటే భూమి నాలుక తడిపేసుకోవడానికే కష్టం! పక్కనే దుగ్గొండి (2.4), నర్సంపేట (3.4), వర్ధన్నపేట, పర్వతగిరిలో (3.8) కాస్తా వాన పడింది. కానీ నల్లబెల్లి రైతులు మాత్రం ఇంకా మొక్కలు పెట్టుకోలేక ఆకాశం వైపు చూస్తున్నారు. సరిపడా తేమ లేకుంటే పంట మొదలెట్టాలి అంటే ఎలా? ఇది రైతులకు పరీక్షలా ఉంది! గవర్నమెంటోళ్లు ఎప్పటికప్పుడు చూసుకొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నరు. సర్కారోళ్లూ వింటున్నారా?...



