వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి తీసుకోండి: ఇర్ఫాన్ పఠాన్

ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించారు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ బౌలింగ్‌లోనూ సిక్సర్లతో చెలరేగుతున్న ఈ యువ సంచలనాన్ని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించారు. "వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడే ఎంపిక చేస్తే మరో 20 ఏళ్ల పాటు భారత్ తరఫున ఆడగలడు" అని ఇర్ఫాన్ పేర్కొన్నారు.



