చెరువు బాధితుల భూ పోరాటం.. కలెక్టరేట్కు పాదయాత్ర
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు 101 ఎకరాల పైగా భూమిని సేకరించే ప్లాన్లో ప్రభుత్వం ఉంది. అయితే 2013 యాక్ట్ ప్రకారం తమకు ఫుల్ నష్టపరిహారం ఇచ్చే వరకు చెరువు ఎత్తు పెంచొద్దంటూ రైతులు 12 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. న్యాయమైన పరిహారం ఇచ్చేదాకా ఫైట్ ఆపేది లేదని బుద్ధారం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.



