ఇంటి గోడ కూలి ఇబ్బందులు పడుతున్న కుటుంబం

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దవలస గ్రామంలో తుఫాను ప్రభావంతో రైతు అర్జపు జోగయ్య ఇంటి గోడ కూలిపోయింది. గోడ కూలడంతో వర్షపు నీరు ఇంట్లోకి చేరి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

