యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TG: BRS పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. సదస్సు కోసం ఇప్పటికే BRS యువజన, విద్యార్థి విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఈ సభకు అనుమతి ఇవ్వాలని పార్టీ నాయకులు గత రెండు వారాల క్రితమే పోలీసులను కోరగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో సభకు అనుమతి ఇవ్వాలని కోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.


