← Back to news

జడ్చర్లలో ఘోర ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

By Surendar Panuganti· 2d ago

TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నాగసాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాగసాల నుంచి జడ్చర్లకు బైక్‌పై వస్తున్న ఇద్దరు కూలీలను కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.