సినిమాతో జీవితం మారింది.. వ్యక్తిత్వం మారలేదు

సినిమా తన జీవితాన్ని మార్చినా, వ్యక్తిత్వం మాత్రం మారలేదని నటుడు నాని తెలిపారు. 2008లో ‘అష్టా చమ్మా’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయన, మొదట్లో నటనను పూర్తిస్థాయి కెరీర్‌గా భావించలేదని చెప్పారు. ప్రేక్షకుల ప్రేమ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. గత 10 నుంచి 15 ఏళ్లుగా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నానని, కొత్త దర్శకులు ఎలాంటి కథతో వచ్చినా వినేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.



