రైతుల అనుమతి లేకుండా విల్లా ప్రాజెక్టుకు అనుమతులా..?

AP: రైతుల సమ్మతి లేకుండానే 90 ఎకరాల విల్లా ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారంటూ అమరావతి, తాడేపల్లి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి మున్సిపల్ కమిషనర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా డెవలపర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని వారు ఆరోపించారు. తాజాగా తమకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారని, భూములను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. రైతుల అనుమతి లేకుండా ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపివేయాలని కోరారు.



