← Back to news

వైసీపీలో చేరిన రేగాటి అనిల్‌రెడ్డి

By P. Abhimanyu· 2h ago· Nandyala, Nandyal Urban, Nandyal
వైసీపీలో చేరిన రేగాటి అనిల్‌రెడ్డి

నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మునిశేషి రెడ్డి మనవడు, యువ నాయకుడు రేగాటి అనిల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంద్యాల మాజీ MLA శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 500 మంది అనుచరులు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఆయన చేరిక పార్టీకి కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పారు. యువతను రాజకీయంగా ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పనిచేస్తోందని పేర్కొన్నారు.

More in Local