గ్రాండ్‌గా బ్రహ్మోత్సవాలు.. CM పట్టు వస్త్రాలు సమర్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 9 రోజుల పాటు 16 వాహన సేవల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


