పండుగను ప్రశాంతంగా జరుపుకోండి: SI

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల ప్రజలు దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉదయగిరి ఎస్సై కాసుల శ్రీనివాసులు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా కొండాపురం మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.



