బస్సు నుంచి ప్యాసింజర్‌ను దించేస్తే.. 60 వేల పెనాల్టీ

తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు వైరల్‌గా మారింది. బస్సు కండక్టర్ టికెట్ చింపేసి, ప్రయాణికుడిని బస్సు నుంచి దించినట్లు ఆరోపణలొచ్చాయి. రవాణా సంస్థ మాత్రం ఈ ఆరోపణలు తప్పు అని చెప్పింది. దీనిపై సరైన విచారణ చేయకపోవడంతో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు ప్రయాణికుడికి 50 వేల రూపాయల నష్టపరిహారంతోపాటు 10 వేలు ఖర్చులు కలిపి ఇవ్వాలని ఆదేశించింది.



