వరుస దొంగతనాల వేళ పోలీసుల బదిలీలపై చర్చ

వికారాబాద్ జిల్లా తాండూరులో వరుస దొంగతనాల కేసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారుల బదిలీలపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేయవద్దని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉంటే విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లతో బదిలీలు చేయడం సరికాదని పేర్కొన్నారు.



