గ్రే హెయిర్‌కు పెరుగుతున్న క్రేజ్.. జెన్ జీ కొత్త ట్రెండ్!

ఒకప్పుడు తెల్ల జుట్టును దాచుకునేందుకు రంగులు వేసుకునేవారు. కానీ ఇప్పుడు కొంతమంది జెన్ జీ యువత గ్రే హెయిర్‌ను ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు. జుట్టుకు గ్రే కలర్ వేయించుకుని కొత్త లుక్‌లో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సెలూన్లలో ప్రత్యేక ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కూడా ఈ ట్రెండ్‌పై యువత ఆసక్తిని పెంచుతున్నాయి.



