కోదాడ నుంచి విజయవాడకు గంటకో డీలక్స్ బస్సు

సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి విజయవాడకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి గంటకు ఒక డీలక్స్ బస్సు చొప్పున అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతున్నట్లు, బుధవారం కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


