పేద కుటుంబాల ఇళ్లకు సిమెంట్ అందించిన ఉప్పల వెంకటేష్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి 5వ వార్డు తిమ్మరాసిపల్లిలో మూడు ఇళ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేష్ ఉచితంగా సిమెంట్ అందజేశారు. శుద్ధకంటి వెంకటయ్య, శుద్ధకంటి యాదయ్య, చిత్తారి శ్రీరాములు ఇళ్ల నిర్మాణానికి ఈ సిమెంట్‌ను పంపిణీ చేశారు. ఉప్పల వెంకటేష్ సహకారంతో నిర్మాణ పనులకు అవసరమైన సిమెంట్ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బావాండ్ల మధు, కుడుముల మనోహర్ రెడ్డి, దాచేపల్లి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.



