బాధిత నర్సు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చౌటుగూడెం గ్రామానికి చెందిన నర్సు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో హత్యకు గురైన ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కొంత ఆర్థికసాయం అందించామని తెలిపారు.



