← Back to news

హృదయ విదారకం.. కదల్లేని స్థితిలో చెల్లయ్య

By VANDAVASI NAGARAJU· 2h ago· Tirupati, Peddapuram, Kakinada

తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గిరిజన గ్రామంలో చెల్లయ్య దయనీయ పరిస్థితిలో జీవిస్తున్నారు. అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఆయనకు కనీసం తినడానికి ఆహారం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సి. మల్లవరం పర్యటనలో ఈ పరిస్థితిని సీపీఎం జిల్లా కార్యదర్శి గుర్తించారు. చెల్లయ్యకు తక్షణమే ఆహారం, వైద్యం, నివాసం, అవసరమైన ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆయనకు అండగా నిలవాలని కోరారు.

హృదయ విదారకం.. కదల్లేని స్థితిలో చెల్లయ్య

More in Local