చౌదరిగూడలో ఎస్‌ఐ విజయ్‌కుమార్కు ఘన వీడ్కోలు

జిల్లేడు మండలం చౌదరిగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్కు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు నిర్వహించారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయన చేసిన సేవలను నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. ఆయన విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి ఆరోగ్యంతో విజయాలు సాధించాలంటూ ఆత్మీయ వీడ్కోలు పలికారు.



