‘బుర్ఖా తీయమని చెప్పే చదువు మాకొద్దు’.. కాశ్మీర్‌లో ఆందోళన
జమ్మూ కాశ్మీర్‌లోని డోడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ విద్యార్థినులు నిరసన చేపట్టారు. గైనకాలజీ విభాగం హెడ్ డా.మధు చిబ్ బుర్ఖా లేదా అబాయా ధరించి లేబర్ రూమ్‌లోకి రావద్దని, ఏప్రాన్ వేసుకొని రావాలని చెప్పారని విద్యార్థినులు ఆరోపించారు. ఇది తమకు హరాస్‌మెంట్‌లా అనిపించిందని, బుర్ఖా తమ గుర్తింపు, గర్వం అని చెప్పారు. “బుర్ఖా తీయమని చెప్పే చదువు మాకు వద్దు” అని కొందరు స్టూడెంట్స్ చెప్పారు. కాలేజీ అధికారులు ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
