స్కూల్ కమిటీ ఎలక్షన్స్ లో రాజకీయ గొడవ
AP: పల్నాడు జిల్లా తిమ్మాపురంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(SMC) ఎలక్షన్ సందర్భంగా రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఆధిపత్యం కోసం పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో SMC ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. పోలీసులు ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు.



