← Back to news

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఎగ్జిబిషన్

By KUCHIPUDI BUJJIBABU· 5h ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిర్మలా ఫార్మర్స్ వరల్డ్‌లో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా NSS విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించారు. గుంటూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనలను పరిశీలించారు. ఆహార భద్రత, నాణ్యత, పోషక విలువలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రపంచ ఆహార దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు.

More in Local