8 ఏళ్ల పిల్లాడి దీనస్థితి.. వీడియో వైరల్
AP: ప్రకాశం జిల్లా.. రాచవారిపాలెం దగ్గర 8 ఏళ్ల రామయ్య.. గొర్రెలు మేపుతూ కనిపించాడు. నర్రవాడకు చెందిన ఈ బాలుడు వీడియోలో ఏడుస్తూ.. “అన్నా.. నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదు. నేను సరిగ్గా నడవలేకపోతున్నాను” అని చెప్పాడు. చిన్నారిని పనిలో పెట్టారంటూ చైల్డ్ లేబర్ ఆరోపణలు వస్తున్నాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడిని రక్షించి, ఘటనపై విచారణ చేయాలని కోరుతున్నారు.



