← Back to news

అలర్ట్.. మూడు రోజులు..నీటి సరఫరా బంద్!

By Srikanth Goud· 2h ago· Jagitial, Jagitial, Jagitial
అలర్ట్.. మూడు రోజులు..నీటి సరఫరా బంద్!

వెల్గటూర్ గ్రామంలో పాత వాటర్ ట్యాంక్ మరమ్మతు పనుల కారణంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు నల్లా నీటి సరఫరా నిలిచిపోనుందని గ్రామ పంచాయతీ కార్యాలయం తెలిపింది. అనివార్య కారణాల వల్ల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. గ్రామ ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, మరమ్మతు పనులకు సహకరించాలని పంచాయతీ అధికారులు కోరారు.

అలర్ట్.. మూడు రోజులు..నీటి సరఫరా బంద్!

More in Local