బ్రహ్మానందపురంలో స్వచ్ఛత కార్యక్రమం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం ప్రాంతంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వీధులు, రహదారులు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇళ్ల పరిసరాలతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన మంగళగిరిని నిర్మించగలమని నిర్వాహకులు తెలిపారు.


