← Back to news

ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం

By Jelandharkoti Koti· 3d ago
ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తండాకు చెందిన కొమురె అనసూయకు పురిటి నొప్పులు రావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే అనసూయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎంటీ మునీందర్‌ గౌడ్‌, పైలెట్‌ మహేందర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.