బ్యాంకులకు సెలవులు.. సైబర్ మోసాల అలర్ట్!

సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకుల సెలవులు, ఉద్యోగుల సమ్మె కారణంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగనున్నాయి. ఇదే ఛాన్సుగా సైబర్ హ్యాకర్లు కొత్త మోసాలకు తెరతీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. “మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది.. వెంటనే అప్‌డేట్ చేయండి” అంటూ OTP, ATM PIN, CVV అడగొచ్చు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, APK లింకులు, లోన్ యాప్‌లతోనూ మోసం చేసే ఛాన్స్ ఉంది. ఏదైనా చీట్ జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి, కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.



