← Back to news

బెజ్జంకిలో భక్తిభావంతో దుర్గామాత ఉత్సవాలు

By Prakash· 11h ago· Bejjanki, Bejjanki, Siddipet
బెజ్జంకిలో భక్తిభావంతో దుర్గామాత ఉత్సవాలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శివసాయి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి అన్నపూర్ణాదేవి అవతారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు 24 రకాల ప్రసాదాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరికీ అన్నసమృద్ధి కలగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

More in Local