← Back to news

ఆఫీసులో రీల్స్..అడ్డంగా బుక్కైన తహసీల్దార్

By Sharmila· 21h ago
ఆఫీసులో రీల్స్..అడ్డంగా బుక్కైన తహసీల్దార్

మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఓ తహసీల్దార్‌ ఆఫీసులో రీల్స్‌ చేయడం వివాదంగా మారింది. తహసీల్దార్‌ ప్రతీక్షా తేజన్కర్‌ ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తున్న వీడియోతోపాటు కార్యాలయంలో రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో అధికారులు స్పందించారు. ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

More in National