భారత్‌తో కొత్త బంధానికి నేపాల్ రెడీ!

భారత్‌తో సంబంధాలను మరింత బలపరచుకోవాలని నేపాల్ చూస్తోంది. ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే మాట్లాడుతూ నేపాల్ దేశభక్తిని భారత్‌కు వ్యతిరేకంగా చూపించే పాత ధోరణి ఇక ముగిసిందన్నారు. వ్యాపారం, రోడ్లు, రైలు మార్గాలు, విద్యుత్ రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయాలని చెప్పారు. సరిహద్దు సమస్యలను కూడా చర్చలతో పరిష్కరించుకోవాలని తెలిపారు. భారత్‌తో మంచి సంబంధాలు నేపాల్ అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు.



