← Back to news

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం..

By M. Kranthi· 5h ago· Kurnool
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం..

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్‌లో దసరా సందర్భంగా ఎస్సై ఎన్‌సీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు దసరా విషెస్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, చెడుపై మంచి గెలిచిన విజయానికి దసరా గుర్తు అని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి భద్రత కోసం పనిచేస్తారని చెప్పారు.

More in Local