రైతులకు బిందు సేద్య పరికరాల పంపిణీ

నిర్మల్ జిల్లా సోన్ మండలం సంగంపేట్ గ్రామంలో రైతు లోలం జగన్ పొలంలో ఇవాళ బిందు సేద్య పరికరాలను అందజేసి, వాటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన అధికారి సాదుల మౌనిక మాట్లాడుతూ.. బిందు సేద్యంతో నీటిని ఆదా చేయవచ్చని, ఫర్టిగేషన్ విధానం ద్వారా ఎరువులను సమర్థంగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈపీసీ మహేంద్ర కంపెనీ DCO దశరథ్, పలువురు రైతులు పాల్గొన్నారు.


