సన్నవడ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి

TG: సన్నవడ్లు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని భీమదేవరపల్లి మండల వ్యవసాయ అధికారిణి పద్మ సూచించారు. సెప్టెంబర్ 10వ తేదీలోగా సన్న రకాల వడ్లు వేసిన రైతులు వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. రైతులు సన్న విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత డీలర్ల వద్దే ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. సొంతంగా అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించి సంబంధిత ఏఈఓల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.



