యూపీఐపై ఛార్జీల ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు

రెండు వేల రూపాయల వరకు UPI లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రెండు వేల రూపాయలు దాటిన UPI చెల్లింపులపై భవిష్యత్తులో ఫీజులు విధించే అవకాశం ఉందని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారు. ఐదు వేల రూపాయల చెల్లింపుపై 25 రూపాయలు, పదివేల రూపాయలపై 50 రూపాయల వరకు ఛార్జీలు విధించే వార్తలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగే ఖర్చు చివరికి ప్రజలపైనే పడుతుందని కాంగ్రెస్ పేర్కొంది.


