సట్లెజ్ మూవీ కి మళ్లీ బ్రేక్-ZEE 5 ఓటీటీ నుంచి తొలగింపు

దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' (Punjab 95) మూవీ రిలీజైన రెండు రోజులకే ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుండి డిలీట్ అయింది. సెన్సార్ బోర్డ్ (CBFC)తో మూడేళ్లు ఫైట్ చేసి, ఎన్నో కట్స్‌తో జూలై 3న స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ZEE5 ప్రకటించింది. క్రియేటివ్ విజన్‌కు తాము సపోర్ట్ చేస్తామని, ప్రస్తుత పరిణామాల వల్ల తాత్కాలికంగా తీసేసామని, త్వరలోనే లీగల్ ప్రొసీజర్ ద్వారా మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేసింది. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత ఆధారంగా దీనిని తెరకెక్కించారు.



