పెళ్లి చేసుకున్న ఇద్దరు మగాళ్లు!

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా గంహారియా గ్రామంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు అస్సలు పడకపోవడంతో ఊరి పెద్దలు ఒక వింత పాత సంప్రదాయాన్ని మళ్లీ ఫాలో అయ్యారు. ఊరిలో వర్షాలు పడాలంటే ‘అందిర బిబాహ’ (మగాళ్ల పెళ్లి) చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా జతిన్ (29), కలాండి (27) అనే ఇద్దరు మగాళ్లకు గుడిలో గ్రాండ్‌గా పెళ్లి చేశారు. సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక రోజంతా భార్యాభర్తలుగా కలిసి ఉండి, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని గ్రామస్తుల గట్టి నమ్మకం. ప్రస్తుతం ఈ వింత పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



