← Back to news

విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలి

By Yadla Venudhar· 2h ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
విజయదశమి ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలి

సూర్యాపేట జిల్లా ప్రజలకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలిచిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంట్లో సంతోషం నింపాలని కోరుకున్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని, అందరి జీవితాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని కోరారు. ఈ దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు.

More in Local