సూరత్‌లో బతుకమ్మ సందడి!

గుజరాత్‌లోని సూరత్‌లో తెలంగాణ వైభవాన్ని చాటుతూ సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బాలాజీ నగర్ (GHB) అసోసియేషన్, సిద్ధి వినాయక మందిర కమిటీ, పద్మశాలీ సమాజం, కల్పన ప్రియాంక టౌన్ కైలాస్ నగర్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. స్థానిక తెలంగాణ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చారు. సూరత్‌లో తెలంగాణ సంస్కృతిని చాటుతున్న మహిళలను నిర్వాహకులు అభినందించారు. ఈ ఉత్సవంలో అంబటి పద్మ, వెంకటమ్మ, నిర్మల, సామల ఝాన్సీ, తుమ్మ పుష్పమ్మ పాల్గొన్నారు.





