← Back to news

ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

By Mohan· 2h ago· Vizianagaram
ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఆటో ఢీకొని బొంతల అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ పెయింటింగ్ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతడిని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

More in Local