జ్ఞానేశ్వరి ఎక్కడ? 100 రోజులైనా వీడని మిస్టరీ!

AP: కాకినాడ జిల్లా, తుని మండలం, CH అగ్రహారంలో పాప జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ 100 రోజులైనా వీడలేదు. జూన్ 6న స్థానిక పామాయిల్ తోటలో ఆడుకుంటూ జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి పోలీసులు.. కిడ్నాప్, ఫారెస్ట్ యానిమల్స్ ఎటాక్.. ఇలా డిఫరెంట్ యాంగిల్స్‌లో డీప్ ఎంక్వైరీ చేసినా బేబీకి సంబంధించి ఏ ఆధారాలూ లభించలేదు. ఈ కేసు అప్‌డేట్స్‌ని పోలీసులు హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. కానీ, చిన్నారి ఏమైందో తెలియకపోవడంతో ఆ ఫ్యామిలీ విషాదంలోనే ఉంది. రోజూ పాప కోసం ఎదురుచూస్తోంది.


