చైన్ లాగితే ఇంత రిస్కా?
అలారం చైన్ లాగడంతో బ్రిడ్జిపైనే రైలు ఆగిపోయింది. ఢిల్లీ సరాయ్ రోహిల్లా–పటేల్ నగర్ సెక్షన్‌లో 54411 నంబర్ రైలులో ఈ ఘటన జరిగింది. చైన్‌ను రీసెట్ చేసేందుకు ట్రైన్ మేనేజర్ శివ్‌జీ రాయ్ రైలు కింద నుంచి పాకుతూ వెళ్లారు. ట్రాక్‌ల మధ్యలో, బ్రిడ్జిపై నుంచి కింద పడే ప్రమాదం ఉన్నా ఆయన వెళ్లాల్సి వచ్చింది. బ్రిడ్జిపై సేఫ్ వాక్‌వే లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అలారం చైన్ లాగాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.


